కామారెడ్డి క్రైం : వనమహోత్సవంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం సాధించాలని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. వనమహోత్సవంపై పలు సూచనలిచ్చారు. వీసీ అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ నుంచి జిల్లా అధికారులతో మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 24.66 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 17.78 లక్షల మొక్కలు నాటామన్నారు. వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎఫ్‌వో నీరజ్, అదనపు కలెక్టర్ గిరి, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
27న గ్రామ, వార్డు సభలు..
సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందు కు ఈనెల 27 న గ్రామ సభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ అధికారులకు సూచించారు. సోమవారం ‘సర్’ కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కా న్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా అధికారులకు పలు సూ చనలు ఇచ్చారు. మ్యాపింగ్ కాని, అనామలిస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను ప కడ్బందీగా చేపట్టాలన్నారు. నియోజకవర్గాల వారీ గా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు స ర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేశ్వర్, తహసీల్దార్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
సెలవులో కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన వచ్చేనెల 10 వరకు సెలవులో ఉంటారు. అప్పటివరకు మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.


