మహమ్మద్‌నగర్ ఎమ్మార్పీఎస్ కార్యవర్గం ఎన్నిక
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల ఎమ్మార్పీఎస్ కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకు న్నట్లు జిల్లా అధ్యక్షుడు సర్వగల రవీందర్ తెలిపారు. మండల అధ్యక్షుడిగా గుడ్ల భూమయ్య (మహమ్మద్ నగర్), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బండారి సాయిలు, ప్రధాన కార్యదర్ళులుగా దాసరి సాయిలు, సున్నాయిల పొద్ద పోచయ్య, సలహాదారులుగా బండారి బాలరాజ్, దండుపోచయ్య, ఎర్రొళ్ల మురళి, గంగారాం, గుడ్ల రవీందర్, మైశయ్య ప్రచార కార్యదర్శులుగా సంగం రమేష్, ఎర్రొళ్ల పొచయ్యను ఎన్నుకున్నారు. అలాగే మండల యువసేన అధ్యక్షులుగా బొమ్మగళ్ల నగేష్, కర్రొళ్ల రవిని ఎన్నుకున్నారు.
అక్కాపూర్ గ్రామ ఎమ్మార్పీఎస్ ..
మాచారెడ్డి: మండలంలోని అక్కాపూర్ గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుండెల్లి చిన్న చంద్రం,ఉపాధ్యక్షుడిగా గుండెల్లి రాజు, మద్దికుంట రాజు,ప్రధాన కార్యదర్శిగా గడ్డం శ్రీకాంత్,కోశాధికారిగా గుండెల్లి రాజేందర్,కార్యదర్శులుగా బట్ట దేవయ్య,చిన్న దేవయ్య,మద్దికుంట సురేష్,శ్రీనివాస్,గౌరవాధ్యక్షులుగా దుర్గయ్యలను ఎన్నుకున్నారు. అలాగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిధులుగా రాహుల్,సతీష్ లను ఎన్నుకున్నారు మండల నాయకులు జాన్,రవి,సురేష్, రాజెల్లం,బాబు, రమేశ్‌లు ఉన్నారు.
గాంధారి మండల ఎమ్మార్పీఎస్..
గాంధారి(ఎల్లారెడ్డి): గాంధారి మండల ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు సామ్యేల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని షాదీఖానాలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సంగెం రాజు, ఉపాధ్యక్షుడిగా గంద్యాటం సాయిలు, రవి, దేవయ్య, ప్రదాన కార్యదర్శులుగా చీమన సాయిలు, సర్వాపూర్ రాజుతో పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ర్యాగట్లపల్లి గ్రామ కాంగ్రెస్ ..
భిక్కనూరు: మండలంలోని ర్యాగట్లపల్లి కాంగ్రెస్‌పార్టీ నూతన కార్యవర్గాన్ని కార్యకర్తలు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నాగి రమేశ్, ఉపాధ్యాక్షు లుగా ఆకిటి రంజిత్‌రెడ్డి, బోచ్చుకుంటయ్య, ప్రధాన కా ర్యదర్శిగా రాజేశ్వర్,సహయకార్యదర్శులుగా సాంబ మై పాల్‌రెడ్డి దుమాల చిన్న మల్లయ్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడునరేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
బీర్కూర్ మండల సర్పంచుల ఫోరం
అధ్యక్షుడిగా బోయిని శంకర్
బాన్సువాడ : బీర్కూర్ మండల సర్పంచుల ఫోరం ఎన్నికను మండలకేంద్రంలో ఎన్నిక నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా బోయిని శంకర్(దామరంచ), ఉపాధ్యక్షుడిగా బాన్సువాడ మణేవ్వ(కిష్టాపూర్), ప్రధాన కార్యదర్శిగా దేవి సింగ్(బీర్కూర్ తండా)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు బోయిని శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని అన్నారు. ఎన్నికై న సర్పంచులను కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. అప్పారావు, నాగేశ్వర్‌రావు, మల్లుగొండ, బస్వరాజ్ తదితరులు ఉన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణ కమిటీ నియామకం
బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ కమిటీని ఆదివారం నియమించా రు. ఆదివారం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కనుకుట్ల రాజు అధ్యక్షతనలో జనరల్ బాడి సమావేశం నిర్వహించారు.ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడిగా గడుమల లింగమేశ్వర్, ఉపాధ్యక్షుడిగా బర్ల సుధాకర్, చందూరి పెద్ద నారాయణ, చెనంగారి అంజయ్య, తొడిమెల అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా పుట్టి చిన్న సాయిలు, సహాయ కార్యదర్శిలుగా సోమనగారి హన్మండ్లు, పోల్కం రాజు, చందూరి చిరంజీవి, నాటకారి శ్రీనివాస్ కోశాధికారిగా మంద శంకర్, కార్యవర్గ సభ్యులు, ముఖ్య సలహాదారులును ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు లింగమేశ్వర్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మిస్తామన్నారు.
కరపత్రాల ఆవిష్కరణ..
మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కరపత్రాలను ఆదివారం బాన్సువాడలోని ముదిరాజ్ సంఘ భవనంలో ఆవిష్కరించారు. ఈ నెల 29, 30వ తేదీల్లో పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు జిన్న రఘు రామయ్య, ఉప సర్పంచి జీవన్ తెలిపారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీఎమ్మెల్యే
భిక్కనూరు: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్‌రెడ్డి కుమారుడు నిఖిల్‌రెడ్డి వివాహం శ్రీప్రియతో ఆదివారం మండలంలోని అంతంపల్లి గ్రామంలో జరిగింది. ఈ వివాహనికి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరై నూతన వధూవరులను ఆదివారం ఆశీర్వదించారు. బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సదాశివనగర్ : మండలంలోని జనగాం గ్రామంలో అన్ని వార్డుల్లో గల మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్‌తో, పాటు దోమల మందును పిచికారి చేయించినట్లు సర్పంచ్ మధుబాయి తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తాడ్వాయిలో వాహనాల తనిఖీ
తాడ్వాయి : మండల కేంద్రంలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. సరియైన ధ్రువీకరణ పత్రాలు లేనివారికి జరిమానా విధించారు. మైనర్లకు వాహనాలను ఇవ్వవద్దని సూచించారు. ఏఎస్‌ఐ కొండల్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.
రైస్ మిల్లర్ భారీ కుంభకోణం
మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేట శివారులో ఉన్న కన్నాంబ రైస్ మిల్లర్ భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిసింది.ఈ మేరకు ఆదివారం సదరు రైస్ మిల్లర్ పై కేసునమోదు చేసినట్లు సమాచారం.ధాన్యం కొనుగోలు చేసిన రైస్ మిల్లర్ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించలేదనే ఆరోపణలపై కేసునమోదైనట్లు తెలిసింది.అలాగే కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలు చూపించలేదని ఆరోపణలున్నట్లు సమాచారం.
గుండెపోటుతో బీఆర్‌ఎస్ నేత మృతి
నిజాంసాగర్ : మండలంలోని నర్సింగ్‌రావ్‌పల్లి గ్రామానికి చెందిన గైని విఠల్ (55) అనే బీఆర్‌ఎస్ పార్టీ నేత ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. నర్సింగ్‌రావ్‌పల్లి గ్రామ మాజీ సర్పంచ్‌గా, పిట్లం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌గా, బీఆర్‌ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడిగా, దళిత నాయకునిగా విఠల్ పని చేశారు.
బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలి
సదాశివనగర్ : బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హత గల బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్‌లను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో సంతోష్‌కుమార్ తెలిపారు. అర్హత గల బీసీ మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.
విత్తన డిక్లరేషన్ ఫారం అందించాలి
బాన్సువాడ రూరల్: వర్షాకాలం సీజన్‌లో ఇంటి వరివిత్తనాలు వేసుకున్న రైతులు సీడ్ ఆన్‌లైన్ కోసం డిక్లరేషన్ ఫారం నింపి ఏఈవోలకు అందించాలని మండల వ్యవసాయాధికారి మిఫ్తా ఫయాజుల్లా అన్నారు. ఏఈవో వద్ద ఉన్న ఫారంలో విత్తుకున్న వరి వంగడం పేరుతో పాటు రైతు పట్టాపాస్‌బుక్ నెంబర్, ఆధార్ సంఖ్య నమోదు చేసి ఇవ్వాలన్నారు.
నేడు ఆర్డీవో,ఎంపీడీవో కార్యాలయాలలో ప్రజావాణి
బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డిరూరల్/కామారెడ్డి రూరల్/తాడ్వాయి: ఎల్లారెడ్డి ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాలలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. తాడ్వాయి, కామారెడ్డి, బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీవోలు భరత్‌కుమార్, ఆనంద్, హెప్సిబారాణిలు తెలిపారు.
నేటి జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి
సదాశివనగర్/తాడ్వాయి/ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. ఈమేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి, తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు గైని రాజలింగం, ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు కోరారు.
తాడ్వాయి: మండల కేంద్రంలో ఆదివా రం ట్రాన్స్‌కో, జీపీ ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశా రు. తాడ్వాయి నుంచి చందాపూర్‌కు వెళ్లే రో డ్డులో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించారు. లూజ్ వైర్లను సెట్ చేశారు. లైన్‌మన్ బాలురాజు, గ్రామపెద్దలు మెట్టురాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : ఆటో, రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం నిర్వహించే రాష్ట్రవ్యాప్త బంద్‌కు సీఐటీయూ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రవాణా రంగ కార్మికులందరూ ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను, టోల్‌గేట్ చార్జీలను తగ్గించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


