కామారెడ్డి అర్బన్/పిట్లం/నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి : సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవులా, రాములు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు డిమాండ్ బహిరంగ సభకు కామారెడ్డి జిల్లా నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు కామారెడ్డి కర్షక్ బీఎడ్ కళాశాల వద్ద బయలు దేరే ముందు మాట్లాడారు. అలాగే నాగిరెడ్డిపేట నుంచి టీఎస్‌సీపీయస్‌ఈయూ , పిట్లం నుంచి పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.


