కామారెడ్డి అర్బన్: పద్మశాలీలు ఐక్యంగా ఉండి సామాజికంగా, రాజకీయంగా బలం కావాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ అన్నారు. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారం ఆదివారం స్థానిక క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్‌హాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, అనిల్‌కుమా ర్, అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జి. చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు. నూతన అధ్యక్షుడు సబ్బని కృష్ణహరి, ప్రధాన కార్యదర్శి జీఎన్ స్వామి, కోశాధికారి అల్వాల గోపాల్‌తో పాటు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షుడు సిరిగాద నర్సయ్య, వర్కింగ్ అధ్యక్షుడు సామల బాలనర్సయ్య, దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్(జుక్కల్): అన్నాబావూ సాఠే సేవలు మరువలేనివని సర్పంచ్ మన్యబాయి అన్నారు. ఆదివారం అవాల్‌గావ్ గ్రామంలో అన్నాబావూ సాఠే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాగ్‌నాథ్‌పటేల్, ఉప సర్పంచ్ విజయ్, వార్డు సభ్యులు నర్సాబాయి, బాలరాజు, విఠల్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలోని గంగమ్మ దేవాలయం వద్ద గ్రామ అవసరాల కోసం బోరుకు మోటార్ పంపును ఆదివారం బిగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో నీటి ఎద్దడి కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉపసర్పంచ్ చైతన్య కొండల్‌రెడ్డి,వార్డు సభ్యులు పిల్లి బాబు, నట్ట లింగం, అనిల్, రామస్వామి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ : బోర్లం గ్రామానికి చెందిన యువకుడు మంద శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ మల్లంపేట్‌కు చెందిన ముదిరాజ్ కులస్తులతో పాటు ఆనంత స్వామి స్నేహితులు బాధిత కుటుంబానికి ఆసరా నిలిచారు. ఈమేరకు ఆదివారం శ్రీకాంత్ తల్లికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు.


