గణితంలో విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

గణితంలో విద్యార్థి ప్రతిభ

Aug 24 2026 1:13 AM | Updated on Aug 24 2026 1:13 AM

గణితంలో విద్యార్థి ప్రతిభ ఇందిరమ్మ గృహ ప్రవేశం

లింగంపేట : మండల కేంద్రానికి చెందిన సరస్వతి శిశు మందిర్‌ విద్యార్థి జిల్లా స్థాయిలో నిర్వహించిన గణతశాస్త్రంలో ప్రతిభ చూపి ప్రథమ బహుమతి అందుకున్నట్లు పాఠశాల ప్రధాన మాతాజి సుమలత తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని సరస్వతీ శిశు మందిరాలు విభాగ్‌ ఆధ్వర్యంలో భీమ్‌గల్‌లో రెండు రోజులుగా నిర్వహించిన గణితంలో నూతన ఆవిష్కరణ ప్రదర్శించిన 4వ తరగతి విద్యార్థి శివతేజ ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చిన రంజిత్‌ను ఆదివారం పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, సిబ్బంది అభినందించారు.

భిక్కనూరు: మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహ ప్రవేశంలో సర్పంచ్‌ బల్యాల రేఖ సుదర్శన్‌ పాల్గొన్నారు. ఆదివారం లబ్ధిదారులు నూతన వస్త్రాలను బహూకరించారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అ

ధ్యక్షుడు బల్యాల సుదర్శన్‌ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ద్యాగల కిరణ్‌, మద్దూరి రవి, రాంరెడ్డి, నేతలు లింబాద్రి, గంగళ్ల భూమయ్య, మైపాల్‌రెడ్డి, నర్మల రాంచంద్రం, ఉప్పరి సాయిలు, జనార్దన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

మండలంలో భారీ వర్షం

కామారెడ్డి రూరల్‌ : కామారెడ్డి మండలంలో ఆదివారం సాయంత్రం భారీవర్షం కురిసింది. దీంతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు అలుగులు ప్రవహించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement