ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ బుధవారం పరిశీలించారు. పనుల నాణ్యతను పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. వైస్ చైర్‌పర్సన్ మత్తమాల భా గ్యవతి, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, కౌ న్సిలర్లు తిరుపతి, చంద్రయ్య, గఫార్ ఉన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పరిశీలించారు. పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సిబ్బందికి సూచించారు. కౌన్సిలర్ సయ్యద్ గఫార్ తదితరులు ఉన్నారు.


