భిక్కనూరు: అందరికీ న్యాయసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం న్యాయసేవ అధికార సంస్థను ఏర్పాటు చేసి ఉచిత న్యాయసేవలను అందిస్తోందని కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. బుధవారం భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జడ్జి ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. మహిళలు, బాలికలు, విద్యార్థుల భధ్రత, చట్టపరమైన హక్కులు వారిపై జరుగుతున్న మోసా లు, పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూఎల్ సభ్యురాలు స్వర్ణలత, జూనియర్ అసిస్టెంట్ సామ్యూల్ ఖాన్, పార లీగల్ వలంటీర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


