కల్తీ పేరుతో గీత వృత్తిపై దాడులు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కల్తీ పేరుతో గీత వృత్తిపై దాడులు మానుకోవాలి

Aug 13 2026 1:21 AM | Updated on Aug 13 2026 1:21 AM

కామారెడ్డి టౌన్‌/ భిక్కనూర్‌/ మాచారెడ్డి: కల్తీ కల్లు పేరుతో కల్లుగీత వృత్తిపై పథకం ప్రకారం చేస్తున్న దాడులను తక్షణం నిలిపివేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ‘గీతన్నల చైతన్య బస్సు యాత్ర’ బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రేణుక ఫంక్షన్‌ హాల్‌లో సభను ఏర్పాటు చేశారు. అనంతరం బస్సు యాత్ర భిక్కనూర్‌, మాచారెడ్డి మండల కేంద్రాలకు చేరుకుంది. వారికి సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement