నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలో ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్న మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో చందర్ నాయక్ సూచించారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో నూతనంగా చేపట్టిన బోర్‌వెల్ రీచార్జీ పిట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మండలంలోని పోచారం ప్రాజెక్టును, అక్కడి నుంచి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని పలు రికార్డులను, కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించబోయే సమావేశపు హాల్‌ను పరిశీలించారు. ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో ప్రభాకరచారి, ఏపీవో సక్కుబాయి, మాల్తుమ్మెద, పోచారం గ్రామాల సర్పంచులు సాయిలు, సంజీవరావు, టీఏ సత్యప్రసాద్, జీపీ కార్యదర్శి అశోక్, ఏఫ్‌ఏ సాయిలు ఉన్నారు.


