సర్వీస్‌ రోడ్డుకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ రోడ్డుకు మోక్షం

Aug 13 2026 1:21 AM | Updated on Aug 13 2026 1:21 AM

ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలి సారొస్తున్నారని.. ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు మోడల్‌ స్కూల్‌లో మాక్‌ పోలింగ్‌

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్డు నుంచి నేషనల్‌ హైవే 44కు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూ ర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. స్థానికులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా ఆయన తక్షణ మే స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండు రో జుల్లోనే గుంతలను పూడ్చివేసి, రహదారిని పు నరుద్ధరించి బుధవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ సలహాదారుకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

భిక్కనూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ పొట్టిగిని శంకర్‌, వార్డు సభ్యుడు జ్ఞానప్రకాశ్‌రెడ్డి, సీనియర్‌ నేత డప్పు రవి ఎమ్మెల్యేను కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలన్నారు.

బాన్సువాడ రూరల్‌: ‘రాజు రాకట చూడు..రోడ్డు నూకుట చూడు’ అన్న చందంగా మండలంలోని బోర్లంక్యాంపులో గల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పరిశుభ్రత పనులు కొనసాగాయి. కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పాఠశాలకు వస్తున్నారనే సమాచారంతో ప్రాంగణంలోని ముళ్లపొదలు, గడి తొలగింపునకు చర్యలు చేపట్టారు.

దోమకొండ: ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని హిందుస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ జిల్లా సీనియర్‌ మేనేజర్‌ ఉప్పర్‌పల్లి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం మండలంలోని అంబరిపేట గ్రామానికి చెందిన రైతుగునిగంటి ప్రవీణ్‌రావు గత నాలుగేళ్లుగా భూమిలో ఆయిల్‌ పామ్‌సాగు చేయగా, ఈ ఏడాది గేలలు కటింగ్‌కు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, క్లస్టర్‌ అధికారి సత్యనారాయణ, కామారెడ్డి క్లస్టర్‌ ఉద్యాన అధికారులు సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

లింగంపేట: మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో బుధవారం పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను తహసీల్దార్‌ సు రేశ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్‌, రమేశ్‌, విఠల్‌, రవి, ఏదుల్‌, అశోక్‌, సతీశ్‌, బాలాగౌడ్‌, హర్షద్‌పాష, రాజు, కృష్ణమూర్తి, సంజీవ్‌ పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు..

లింగంపేట: మండలంలోని బాణాపూర్‌, పొ ల్కంపేట గ్రామాల్లో పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్‌ పంపిణీ చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాలకిషన్‌, అశోక్‌, రాములు, నాగరాజు, దేవేందర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి: మోడల్‌ స్కూల్‌లో నిర్వహించిన మాక్‌ ఎలక్షన్స్‌లో పాఠశాలకు చెందిన హెడ్‌బాయ్‌గా సాయికుమార్‌ గెలుపొందినట్లు ప్రిన్సిపాల్‌ తోటగాంధీ బుధవారం తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన మాక్‌ ఎలక్షన్‌లో హెడ్‌ బాయ్‌, హెడ్‌ గర్ల్‌, డిప్యూటీ హెడ్‌ బాయ్‌, డిప్యూటీ హెడ్‌ గర్ల్‌కు ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ జహంగీర్‌, ఉపాధ్యాయులు రాజశేఖర్‌, ప్రియదర్శిని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement