మాచారెడ్డి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడవ ని ఒకవైపు, మరోవైపు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ వరి వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు మొండి ధైర్యంతో ఎట్లయితే అట్లయితది అనుకుంటూ వరి నారు పోశారు.దుక్కులు దున్నారు.ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పోటా పోటీగా నాట్లు వేయడం మొదలు పెట్టారు.మొత్తం మండలంలో గతేడాది 15వేల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు ఇప్పటి వరకు 10 వేల ఎకరాల్లో వరి నాటు వేసినట్లు మండల వ్యవసాయాధికారి పవన్ కుమార్ తెలిపారు. 15 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటారని వివరించారు.


