అంతర్రాష్ట్ర ఎకై ్సజ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర ఎకై ్సజ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

మద్నూర్‌(జుక్కల్‌): పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి మద్యం, మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఎకై ్సజ్‌ శాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఎకై ్సజ్‌ ఈఎస్‌ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు బిచ్కుంద ఎకై ్సజ్‌ ఎస్సై నాగేశ్‌ సిబ్బందితో కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మండలంలోని సలాబత్‌పూర్‌ అంతర్రాష్ట్ర ఎకై ్సజ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి నమూనాలను సేకరించారు. దాబా హోటళ్లు, రైస్‌మిల్లులు, గోదాముల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ సిబ్బంది దేవీసింగ్‌, వెంకటేశ్‌, రమేశ్‌ తదితరులున్నారు.

కల్తీ కల్లు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం

లింగంపేట/బాన్సువాడ రూరల్‌/మాచారెడ్డి : కల్తీ కల్లు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి ఎకై ్సజ్‌ సీఐ షాకీర్‌ అహ్మద్‌ హెచ్చరించారు. శనివారం ఆయన లింగంపేట మండలం రాంపూర్‌, జల్దిపల్లి, కొండాపూర్‌ గ్రామాల్లోని కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని నాలుగు కల్లు దుకాణాల నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉన్న ల్యాబ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలు సరఫరా చేసినా, సేవించినా చట్టరీత్యా చర్యలు తప్పవని బాన్సువాడ ఎకై ్సజ్‌ సీఐ దిలీప్‌ అన్నారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో పలు వాహనాలు, పాడుబడ్డ భవనాలు, గంజాయి సేవించే అనుమానిత ప్రదేశాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.మాచారెడ్డి మండలం నడిమి తండా, మైసమ్మ చెరువు, గజ్యానాయక్‌ తండా, కాకుల గుట్ట తండాలతో పాటు పాల్వంచ మండలం ఎలుపుగొండ తండాలపై ఎకై ్సజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు లీటర్ల నాటు సారా, పులియబెట్టిన పానకాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్‌ సీఐ సంపత్‌ కృష్ణారావు మాట్లాడుతూ...ప్రజల ఆరోగ్యాలను నాశనం చేసే నాటు సారాను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈదాడుల్లో ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.

కల్తీ కల్లు, అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

దోమకొండ: కల్తీకల్లు అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దోమకొండ ఇంచార్జి ఎకై ్సజ్‌ సీఐ సుందర్‌సింగ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్తీ కల్లు, అక్రమ మద్యం, గంజాయి వంటి నిషేదిత మత్తు పదార్థాల రవాణా, వినియోగం చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement