కామారెడ్డి అర్బన్: పీఆర్‌టీయూ టీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అల్లాపూర్ కుశాల్, పుట్ట శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం లింగాపూర్ బృందావన్ ఫంక్షన్‌హాల్‌లో పీఆర్‌టీయూ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నిక కావడంపై రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భీక్షంగౌడ్‌తోపాటు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అభినందించారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని అధ్యక్షుడు కుషాల్ తెలిపారు.
సీఎంఆర్‌ఎఫ్
చెక్కుల అందజేత
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కన్‌కల్ గ్రామంలో ఇద్దరు బాధితులకు మంజూరైన రూ.54,000 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శనివా రం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఎమ్మె ల్యే మదన్‌మోహన్ ఆదేశాల మేరకు బాధితు ల ఇంటికి వెళ్లి చెక్కులు అందజేశామని నాయ కులు పేర్కొన్నారు.నాయకులు భూపతిరెడ్డి, రాజలింగం, గఫూర్, ప్రతాపరెడ్డి, పెంటురెడ్డి, వెంకటేష్, స్వామి, వెంకట్‌రెడ్డి, సిద్దిరాములు, కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: హనుమకొండలో నిర్వహించిన 5వ జాతీయ జావెలిన్ దినోత్సవం, కిడ్స్ మీట్, 12వ రాష్ట్ర యూత్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌లు తెలిపారు. అండర్–6 విభాగం 150 మీటర్ల పరుగులో కే.అంబిక బంగారు పతకం, అండర్–12 విభాగం బ్యాక్‌త్రోలో జి.ఆధ్యత్రినయా, మహిళా విభాగం జావెలిన్‌త్రో లో ఎం.అమృత రజత పతకం సాధించినట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు. విజేతలను జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్‌గౌడ్, అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
బాన్సువాడ రూరల్: బాన్సువాడ తాడ్కోల్ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో కొందరు మద్యం సేవిస్తుండటంతో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నివారణ చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి ప్రకృతి వనంలో మద్యం సేవించినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి రూ.5వేలు జరిమానా విధిస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు, ప్రత్యేకించి కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.


