బాన్సువాడ రూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాన్సువాడ పట్టణం టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన అంబిల్‌పూర్ రజిని(34) కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి భర్త బాలరాజు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నిజాంసాగర్: మహమ్మద్‌నగర్ మండలం తెల్గాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి దనుల ఎల్లయ్య నివాసపు రెక్కుల షెడ్డుకు షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ప్రమాదంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిజ్, టీవీ, ఫ్యాన్లు, బల్బులు కాలిబూడిద అయ్యా యి. బాధిత కుటుంబానికి రూ. లక్ష వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు సర్పంచ్ వెల్లుట్ల మేఘన నగేశ్ తెలిపారు.


