భిక్కనూరు: మండలంలోని గుర్జకుంట గ్రామంలోగల పొలాల వద్ద ఉన్న నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను శనివారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వసం చేసి, అందులో ఉన్న రాగి కాయిల్స్‌ను చోరీ చేశారు. మండలంలో బస్వాపూర్, ర్యాగట్లపల్లి, గుర్జకుంట గ్రామల్లో గత మూడు నెలలుగా ఈ చోరీలు తరచూ జరుగుతున్నాయి. గుర్జకుంట గ్రామంలో మూడు నెలల్లో 11 ట్రాన్స్‌పార్మర్లను, ర్యాగట్లపల్లిలో ఐదు, బస్వాపూర్‌లో మూడు ట్రాన్స్‌పార్మర్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులో ఉన్న రాగి కాయల్స్‌ను ఎత్తుకెళ్లారు. ట్రాన్స్‌పార్మర్లకు వెల్డింగ్ చేసిన వాటి జోలికి వెళ్లకుండా, రిపేర్ అయిన వాటిని ధ్వంసం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటి సమాచారం తేలిసిన వ్యక్తులు దీనికి సూత్రదారులుగా ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికై నా పోలీసులు స్పందించి నిందితులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుని రైతులు కోరుతున్నారు.


