ఇంటర్‌ విద్యనే భవిష్యత్‌కు బాటలు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యనే భవిష్యత్‌కు బాటలు

Aug 2 2026 1:04 AM | Updated on Aug 2 2026 1:04 AM

ఇంటర్‌ విద్యనే భవిష్యత్‌కు బాటలు ఆక్రమణకు గురైన అటవీ భూమి స్వాధీనం

బాన్సువాడ : విద్యార్థులకు ఇంటర్‌ విద్యనే భవిష్యత్‌కు బాటలు వేస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆయన డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరిగిందని, డిజిటల్‌ క్లాసులతో విద్యార్థులకు అభ్యాసాన్ని సులభతరం చేస్తాయన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తుందని అన్నారు. డిజిటల్‌ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని, పాఠ్యాంశాలను లోతుగా అర్థం చేసుకుని సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని అన్నారు. బాన్సువాడను ఎడ్యూకేషన్‌ హబ్‌గా మార్చామన్నారు. గతేడాది విద్యార్థుల కోసం దేశాయిపేట్‌లో ఉన్న వసతి గృహం నుంచి బాన్సువాడ కళాశాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌, జిల్లా నోడల్‌ అధికారి సలాం, నాయకులు కృష్ణరెడ్డి, ఎజాస్‌, శ్రీనివాస్‌, విఠల్‌రెడ్డి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

గాంధారి: గాంధారి అటవీ శాఖ రేంజ్‌ పరిధిలోని గండివేట్‌ బీట్‌లో ఆక్రమణకు గురైన అటవీ శాఖ భూములను శనివారం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఆర్వో రమేశ్‌ తెలిపారు. గండివేట్‌ బీట్‌లో ఇటీవల అటవీ భూ మిని ఆక్రమించుకుని పంట సాగు చేశారన్నా రు. సదరు భూములను తిరిగి స్వాధీనం చే సుకుని కందకాలు తవ్వించినట్లు తెలిపారు. అ టవీ భూమలు ఆక్రమణదారులపై చట్టప్రకా రం కేసు నమోదు చేస్తామని ఎఫ్‌ఆర్వో హె చ్చరించారు. బీర్మల్‌ తండాను ఎఫ్‌ఆర్వో సందర్శించి తండావాసులతో సమావేశం ఏర్పాటు చేసి అడవులు, అటవీ భూముల సంరక్షణపై అవగాహన కల్పించారు. అటవీ శాఖ సెక్షన్‌ అధికారులు, బీట్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement