భిక్కనూరు : ఓ చోరీ కేసు నుంచి తప్పించుకునేందుకు ‘దృశ్యం’ సినిమా తరహాలో ప్రయత్నించిన నిందితురాలు చివరకు కటకటాలపాలైంది. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ శనివారం భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగంపల్లికి చెందిన దొడ్ల స్వామి కుటుంబంతో కలిసి ఈనెల 16న వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటి బయట తాళం యథావిధిగా ఉన్నా.. లోపలి గదులు, బీరు వా తాళాలు తెరిచి ఉన్నాయి. అందులో భద్రపరిచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు, 60 తు లాల వెండి ఆభరణాలు, కొంత నగదు కనిపించలే దు. దీంతో స్వామి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేశారు. గ్రామానికి చెందిన దొడ్లె లతను నిందితురాలిగా గుర్తించారు. అయితే ఘటన జరిగిన రోజు తాను షాపింగ్ కోసం కామారెడ్డికి వెళ్లినట్లు బస్సు టికెట్లు, షా పింగ్ బిల్లులు చూపించి తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు మరోసారి సీసీ ఫుటేజీని పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానంతో వాస్తవాలను వెలికితీశారు. నిందితురాలు లత నుంచి చోరీకి గురైన మొత్తం స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ మ ధుసూదన్ తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన భిక్కనూరు సీఐ నరేశ్, ఎస్సై అనిల్, ఏఎస్సై వెంకటరావు, పీసీలు శ్రీకాంత్, కిషన్ గౌడ్, బాలకృష్ణను ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.
రెండు రోజుల్లో చోరీ కేసును
ఛేదించిన పోలీసులు
దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించిన నిందితురాలు
వివరాలు వెల్లడించిన కామారెడ్డి
డీఎస్పీ మధుసూదన్


