బురదమయంగా ఉన్న సురాయిపల్లి తండాకు వెళ్లే రోడ్డు
సురాయిపల్లి తండాకు వెళ్లే రోడ్డంతా బురదమయమై అధ్వానంగా మారింది. దీంతో ఈ మార్గంలో నడవడానికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం తండాకు చెందిన గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి 108 అంబులెన్సు రాగా.. ఈ రోడ్డుపై నడపడానికి డ్రైవర్ ఇబ్బందిపడ్డాడు. కిలోమీటర్ దూరానికి గంటకుపైగా సమయం పట్టిందని ప్రజలు పేర్కొన్నారు. రోడ్డంతా బురదగా ఉండడంతో ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయి పడిపోతున్నామని వాహనదారులు పేర్కొంటున్నారు. బీటీ రోడ్డు వేయాలని కోరుతున్నారు. – లింగంపేట


