లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లి గ్రామంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలో స్కూల్ బిల్డింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు సర్పంచ్ తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉపసర్పంచ్ మన్నె బాలయ్య, అంజాగౌడ్, కిష్టాగౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అట్టెం మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.


