స్వగ్రామానికి చేరిన మృతదేహం | - | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి చేరిన మృతదేహం

Jul 20 2026 1:20 AM | Updated on Jul 20 2026 1:20 AM

స్వగ్రామానికి చేరిన మృతదేహం

వేల్పూర్‌: మండలంలోని కొత్తపల్లి ఎన్‌ గ్రామానికి చెందిన కమ్మరి బాలగంగాధర్‌(48) ఈనెల 8న గుండెపోటుతో దుబాయిలో మరణించగా ఆయన మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరింది. సుమారు పదిహేనేళ్లుగా కుటుంబ పోషణకు దుబాయికి వెళ్లి వస్తున్నాడు.నెల రోజుల క్రితం ఇంటికి వచ్చి దుబాయికి వెళ్లినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఈనెల 8న దుబాయిలో బస్సులో ప్రయాణి స్తూ గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. గంగాధర్‌ చిన్నప్పుడే తండ్రి మర ణించగా ఉపాధికోసం గల్ఫ్‌ వెళ్లాడు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement