ఆధ్యాత్మికం.. | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికం..

Jul 20 2026 1:20 AM | Updated on Jul 20 2026 1:20 AM

కృష్ణాజీవాడి శివాలయం మహిమ గల దేవాలయం

తాడ్వాయి(ఎల్లారెడ్డి): కృష్ణాజీవాడిలోని శ్రీరాజరాజేశ్వర దేవాలయం పవిత్ర, మహిమల గల దేవాలయమని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కై లాస్‌ శ్రీనివాస్‌ రావు అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆదివారం తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడిలో గల రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రెండు సీలింగ్‌ ఫ్యాన్‌లతో పాటు ఆలయ అభివృద్ధికి రూ.40 వేల నగదును ఆలయ కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు.

సామూహిక కుంకుమార్చనలు

కామారెడ్డి అర్బన్‌: స్థానిక ఎన్జీవోస్‌ కాలనీలోని శ్రీలలిత త్రిపురసుందరి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కాలనీతో పాటు పట్టణ మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఉత్సవ విగ్రహం విరాళం

కామారెడ్డి అర్బన్‌: పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి శ్రీకన్యకా పరమేశ్వరి వాసవీ మాత ఆలయానికి వారాహి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విరాళంగా అందజేశారు. వాసవీ ఆలయంలో ఈనెల 23 వరకు జుక్కల్‌ గోపాల్‌ మహారాజ్‌ వారాహి మాత ప్రవచనాలు చేస్తున్నందున భక్తులు విజయవంతం చేయాలన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కాసర్ల కృష్ణమూర్తి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు రాజేందర్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

మెహందీ కార్యక్రమం

భిక్కనూరు: మండల కేంద్రంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా మెహందీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఒకరి చేతికి మరొకరు మెహందీ పెడుతూ సంబురాలు జరుపుకొన్నారు.

ఘనంగా కట్ట మైసమ్మ పండుగ

పిట్లం(జుక్కల్‌): కంభాపూర్‌లో ఆదివారం కట్ట మైసమ్మ, గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సకాలంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థనలు

బాన్సువాడ రూరల్‌: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ బోర్లంక్యాంపునకు చెందిన ముస్లీం యువకులు ఆదివారం నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్టపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాలు లేక బోసిపోతున్న చెరువులు, కుంటలు నిండాలని ప్రజలు, పాడి పంట బాగుండాలని ప్రార్థనలు చేశారు. షబ్బీర్‌, హాషం, రాహత్‌, హాజీమియ, అజ్మత్‌, ఖలీల్‌, సలీమ్‌, అల్తాఫ్‌, అహ్మద్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement