డొంకేశ్వర్: మండల పరిధిలోని పలు గ్రామాల బీటీ రోడ్లపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. రోడ్లపై వీటిని తిప్పకూడదని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు యజమానులు, రైతులు పట్టించుకోవడం లేదు. ఎవరెన్ని చెప్పినా లెక్క చేయం అన్నట్లుగా జీజీ నడ్కుడలో కేజ్ వీల్ ట్రాక్టర్‌తో ఓ యజమాని ఇలా బీటీ రోడ్డెక్కాడు. అయితే, కేజ్ వీల్‌తో రోడ్డెక్కితే రూ.5వేలు జరిమానా విధిస్తామని ఇటీవల నికాల్‌పూర్ జీపీ తీర్మానం చేసినట్లుగానే జీజీ నడ్కుడలో కూడా తీర్మానం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


