కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ నుంచి దేవునిపల్లి వెళ్లే రోడ్డులో శివాలయం దాటిన తర్వాత ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. విద్యుత్ స్తంభాలు, వైర్లను చెట్ల తీగలు అల్లుకుని ప్రమాదకరంగా తయారయ్యాయి. విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి పిచ్చిమొక్కలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ – దేవునిపల్లి రోడ్డులో
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన తీగలు


