ఏళ్లనాటి ఆచారం.. గంగిరెద్దుల విన్యాసం | - | Sakshi
Sakshi News home page

ఏళ్లనాటి ఆచారం.. గంగిరెద్దుల విన్యాసం

Oct 5 2026 1:21 AM | Updated on Oct 5 2026 1:21 AM

దోమకొండ: దసరా పండుగకు ముందు గ్రామా ల్లో గంగిరెద్దుల విన్యాసాలు గ్రామస్తులను అలరించడం ఆనవాయితీ. ఆదివారం దోమకొండలోని రెడ్డి సంఘంలో గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తమ పూర్వీకుల నుంచి దోమకొండ గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో గంగిరెద్దులను నాట్యం ఆడించి వారి వద్ద తోచిన సాయం పొందడం ఆనవాయితీగా వస్తుందని విన్యాసకుడు గంట భిక్షపతి తెలిపారు. భిక్షపతికి రూ. 5000 సాయమందించినట్లు రెడ్డి సంఘాల అధ్యక్షుడు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు. రెడ్డి ఐక్యవేదిక మండల అధ్యక్షుడు పన్యాల రామ్మోహన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాయిని సంతోష్‌ రెడ్డి, మన్నె సాయి రెడ్డి, దుంపల ప్రతాపరెడ్డి, శంకర్‌ రెడ్డి, నర్సారెడ్డి, అనంతరెడ్డి, గోపాలరెడ్డి, నాగరాజురెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement