నవీపేట: మండల కేంద్రంలోని ఆశానగర్ కాలనీ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సేవాలాల్ ఆలయ సమీపంలో కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఆదివారం సమాచారం అందించగా వారు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
వర్ని: జాకోరా శివారులో ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ ప్రధాన కాలువలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాలువలో నీటి ప్రవాహం ద్వారా మృతదేహం పై ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చి ఉంటుందని, మృతుడి వయస్సు 60 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.


