అమ్మో మల్కాపూర్‌.. | - | Sakshi
Sakshi News home page

అమ్మో మల్కాపూర్‌..

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

ఎల్లారెడ్డిరూరల్‌: మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ అంటేనే కార్యదర్శులు గజగజ వణుకుతున్నారు. మూడు నెలలుగా పంచాయతీ కార్యదర్శిగా మండలంలోని ఒక్కో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఎల్లారెడ్డి మండలంలో

31 గ్రామ పంచాయతీలు...

ఎల్లారెడ్డి మండలంలో 31 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 26 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. వీటిలో వెల్లుట్లపేట, అడివిలింగాల, మల్కాపూర్‌, వెల్లుట్ల, లక్ష్మాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి పక్క గ్రామాల పంచాయతీ కార్యదర్శులను ఇన్‌చార్జులుగా నియమించారు. వెల్లుట్ల జీపీకి ఆజామాబాద్‌ కార్యదర్శి ఇన్‌చార్జిగా, వెల్లుట్లపేటకు వెంకటాపూర్‌ కార్యదర్శి, అడివిలింగాలకు కొక్కొండ కార్యదర్శి, లక్ష్మాపూర్‌కు హాజీపూర్‌తాండా కార్యదర్శి ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు.

వర్గపోరుతో..!

మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టు జూన్‌లో ఖాళీ అయింది. ఇక్కడ విధులు నిర్వహించేందుకు ముందుకు రాక పోవడంతో ఉన్నతాధికారులు మండలంలోని ఒక్కో పంచాయతీ కార్యదర్శికి నెల రోజుల పాటు ఇన్‌చార్జులుగా వ్యవహరించాలని సూచించారు. దీంతో గతంలో బదిలీ అయిన కార్యదర్శి నెల రోజుల పాటు ఇన్‌చార్జిగా వ్యవహరించగా, మరో నెల రోజుల పాటు రుద్రారం, అల్మాజీపూర్‌, మత్తమాల పంచాయతీ కార్యదర్శులు ఇన్‌చార్జులుగా చెరో నెల రోజుల పాటు విధులు నిర్వర్తించారు. గ్రామంలో వర్గపోరుతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణల కారణంగా పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహించేందుకు ఆసక్తి కనబర్చడం లేదనే సమాచారం. దీంతోనే మల్కాపూర్‌ జీపీ అంటేనే పంచాయతీ కార్యదర్శులు భయాందోళనకు గురవుతున్నారు.

పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించాలి

మల్కాపూర్‌కు పూర్తి స్థాయిలో పంచాయతీ కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నెలకో కార్యదర్శి మారడంతో తామ తమ పనుల గురించి ఏకార్యదర్శిని అడగాలో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి పంచాయతీ కార్యదర్శిని నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం

పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీ

నెలకో పంచాయతీ కార్యదర్శికి

ఇన్‌చార్జి బాధ్యతలు

విధులు నిర్వహించడానికి

జంకుతున్న కార్యదర్శులు

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement