స్వప్నలోక్‌లో శాఖా సప్తాహం | - | Sakshi
Sakshi News home page

స్వప్నలోక్‌లో శాఖా సప్తాహం

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

స్వప్నలోక్‌లో శాఖా సప్తాహం వెంకటస్వామి జయంతిని ఘనంగా నిర్వహించాలి ఆంక్షలు లేకుండా పంట దిగుబడులను కొనుగోలు చేయాలి రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌కు సన్మానం

కామారెడ్డి అర్బన్‌: పట్టణ పరిధిలోని స్వప్నలోక్‌ కాలనీలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శాఖా సప్తాహం నిర్వహించారు. జిల్లా సంఘచాలక్‌ కొమిరెడ్డి స్వామి మాట్లాడుతూ ప్రతి రోజు గంట శాఖా చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండవచ్చని అ న్నారు. కాలనీవాసులు, బాలలు పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతిని సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో నిర్వహించాలని మాలసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యాల సంతోష్‌ కోరారు.ప్రజాసంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు వెంకటస్వామి అని ఆయన అన్నారు.

భిక్కనూరు: ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం రైతులు పండించిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించాలని రామేశ్వర్‌పల్లి వీడీసీ మాజీ అధ్యక్షుడు తక్కళ్ళ నర్సారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రామేశ్వర్‌పల్లిలో మాట్లాడుతూ మక్క పంట రైతుల చేతికి వచ్చిందని ఇప్పటి వరకు మక్క కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. యాసంగిలో పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలను ఎరువులను అందించాలన్నారు.

బిచ్కుంద: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌గా ఎన్నికై న దస్తీరాంను ఆదివారం బిచ్కుంద మండల రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు సన్మానించి అభినందనలు తెలియజేశారు. బిచ్కుందకు చెందిన దస్తీరాం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ సామాజిక సేవలో ముందు ఉన్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులుగా పనిచేస్తూ గతంలో ఎన్నో రక్తదానం, వైద్య శిబిరాలు నిర్వహించి సేవలు అందించారు. పేదలకు తనవంతు సహాయం అందజేస్తానని దస్తీరాం తెలిపారు. మండల రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ శివకుమార్‌, రచ్చ శివకాంత్‌, వైద్యుడు నర్సింలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement