దోమకొండ : జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సక్కు (38) అనే పేషెంట్ డెంగీ వ్యాధితో బాధపడుతోంది. ‘ఏ’ పాజిటివ్ తెల్ల రక్త కణాలు అవసరం కావడంతో దోమకొండకు సిద్దంబర్ రక్తదానం చేశారు. ఈసందర్భంగా ఆదివారం సిద్దంబర్‌ను ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు సన్మానించారు. తెల్ల రక్త కణాలు ఇవ్వడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవని డాక్టర్ బాలు పేర్కొన్నారు. కేబీఎస్ రక్త నిధి కేంద్రం నిర్వాహకులు జీవన్, టెక్నీషియన్లు పాల్గొన్నారు.


