నెత్తురోడుతున్న రహదారి | - | Sakshi
Sakshi News home page

నెత్తురోడుతున్న రహదారి

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

● రెయిలింగ్‌ ఓపెన్‌ ఉండటంతో ప్రమాదాలు

● వారంలో ఇద్దరి మృతి..

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

నస్రుల్లాబాద్‌: మండల కేంద్రంలో జరగుతున్న జా తీయ రహదారి(765డీ) పనులు నత్తనడకన సా గుతుండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వీసు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో రెయిలింగ్‌ తీసి ఉంచారు. దీంతో రహదారిపై వేగంగా వెళ్తున్న బస్సులు, లారీలు,ఇతర వాహనాలు సైడ్‌లకు రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నస్రుల్లాబాద్‌ – బాన్సువాడ వరకు జరుగుతున్న పనుల్లో జాప్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బొమ్మన్‌దేవ్‌పల్లి క్రాస్‌ రోడ్డు వద్ద సర్వీసు రోడ్డు పూర్తి కాకపోవడంతో ప్రమాదా లు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం తిమ్మపూర్‌ వైపు నుంచి సర్వీసు రోడ్డు దాటుతుండగా నిజామాబాద్‌ నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఢీ కొనడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. అలాగే దుర్కి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వెనక నుంచి వచ్చిన వాహనం ఢీ కొనడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుర్కి శివారులో ఓ బైకును రెయిలింగ్‌ దాటుతుండగా వేగంగా వస్తున్న స్కూటీ ఢీ కొట్టడంతో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గత వారం రోజుల క్రితం నస్రుల్లాబాద్‌ తహసీల్దార్‌ సిబ్బంది రోడ్డు దాటుతుండగా మూడు బైకులు ఢీకొన్నాయి. సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జరుగుతున్న ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారి పనులను త్వరగా పూర్తి చేసి, సర్వీసు రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని, రెయిలింగ్‌ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement