క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Oct 5 2026 1:21 AM | Updated on Oct 5 2026 1:21 AM

● నలుగురికి గాయాలు

ఆటో బోల్తా.. ఒకరి మృతి

డిచ్‌పల్లి: ప్రయాణికులతో వెళ్తు న్న ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై ఎండీ ఆరిఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన బట్టు అంజి(23) తన తల్లి శోభ అనారోగ్యంతో బాధపడుతుండటంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చూయిద్దామని ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. నాగ్‌పూర్‌ గేట్‌ వద్ద ఇద్దరూ ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ ఆటో ఎక్కారు. ఆటోలో వీరితో కలిపి మొత్తం ఐదుగురు ప్రయాణికులున్నారు. నడిపల్లి గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్‌ పక్కన కూర్చున్న అంజి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులు బయటకు వచ్చిన వెంటనే డ్రైవర్‌ ఆటోను పైకిలేపి ఆటోతో సహా అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య స్వాతి, 7 నెలల బాబు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement