● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండ లం అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడు పిట్ల గణేశ్(32) బైక్ అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన గణేశ్ తన బంధువులు, స్నేహితులతో కలిసి అడెల్లి మహాపోచమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివా రం వచ్చాడు. దర్శనం చేసుకుని భోజనం చేసిన తర్వాత గణేశ్ బహిర్భూమి కో సం బైక్‌పై వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థాని కులు 108లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే గణేశ్ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


