నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

లింగంపేట: అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోందని ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌లో టెక్నాలజీకి అనుగుణంగా అన్ని హంగులతో కార్పొరేట్‌ స్థాయిలో విద్యా బోధన ఉంటుందన్నారు. శుక్రవారం మోతె గ్రామ శివారులో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ సమీకృత భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకొనే సౌకర్యం ఉంటుందన్నారు. ఆధునిక తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్యాంటిన్‌ సౌకర్యం, వసతి గృహాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ పాఠశాలలో 2,600 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన..

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు

శంకుస్థాపనలో ఎంపీ షెట్కార్‌,

ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

పేద విద్యార్థులకు వరం :

ఎమ్మెల్సీ అంజిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement