పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలి

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలి నేటినుంచి నీటి సరఫరాలో అంతరాయం డ్రంకన్‌ డ్రైవ్‌లో 49 మందికి కోర్టు శిక్షలు

అభివృద్ధి పథంలో..

కామారెడ్డి క్రైం: పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ప్రధాన రహదారి వెంట శుక్రవారం జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమాలు సక్రమంగా చేపట్టాలని సూచించారు. క్రమం తప్పకుండా చెత్త సేకరణ, మురికి కాలువల శుభ్రత చేపడుతూ స్వచ్చమైన వాతావరణం ఉండేలా కృషి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో గిరి, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు శనివారంనుంచి మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని మిషన్‌ భగీరథ ఆర్మూర్‌ డివిజన్‌ ఈఈ ఒక ప్రకటనలో తెలిపారు. సదాశివనగర్‌ మండలం మల్లుపేట వద్ద ప్రధాన పైప్‌లైన్‌కు మరమ్మతుల కారణంగా 11, 12, 13, 14 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి, గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి మండలాల ప్రజలు దీనిని గమనించాలని కోరారు. కామారెడ్డి పట్టణానికి మాత్రం రోజు విడిచి రోజు నీటి సరఫరా ఉంటుందని తెలిపారు.

కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లాలోని కోర్టులు శుక్ర వారం 49 మందికి శిక్షలు విధించాయి. ఇద్దరికి రెండు రోజులు, ముగ్గురికి ఒక రోజు చొప్పున జైలు శిక్షలతో పాటు మొత్తం 49 మందికి కలిపి రూ.58 వేల జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ, పోలీస్‌ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, మహిళా సంఘాలకు భవనాలు నిర్మిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించడానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. పాఠశాలకు మోతె గ్రామ రైతులు తమ భూములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు పేద విద్యార్థులకు వరం లాంటివని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్యే అంజిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో విద్యతో పాటు క్రీడల్లో తర్ఫీదు ఇస్తారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రైతులు సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుజాతాబాయి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేశ్‌ చంద్ర, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్‌ రజిత, మున్సిపల్‌ చైర్మన్‌ పద్మ శ్రీకాంత్‌, ఆర్డీవో ప్రభాకర్‌, సర్పంచులు ప్రత్యూష, సాయిరాం, అట్టెం శ్రీనివాస్‌, సకృనాయక్‌, కౌడ రవీందర్‌, సంతోష్‌రెడ్డి, అశోక్‌రావు, ప్రసాద్‌గౌడ్‌, నాయకులు నారాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement