భిక్కనూరు: యూనివర్సిటీలు పరిశోధన కేంద్రాలుగా మారాలని ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ పురుషోత్తం పేర్కొన్నారు. భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం ఇంగ్లిష్ భాష నేర్చుకోవడమే నైపుణ్యం కాదని, బతకడానికి కావాల్సిన అన్ని రకాల నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. అందుకే ఉన్నత విద్యామండలి మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యం పెంపొందించే కోర్సులకు రూప కల్పన చేస్తోందన్నారు. విద్యర్థులు సెమినార్‌లలో పాల్గొనడం ద్వారా వారికి తగినంత పరిశోధన అనుభవం లభిస్తుందన్నారు.
నూతన ఆవిష్కరణల్లో ఫిజిక్స్ ముందుందని రిటైర్డు ప్రొఫెసర్ మధుకర్ పేర్కొన్నారు. సెమికండక్టర్‌ల గురించి ఈ సెమినార్‌లో చర్చించడం అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లుగా సెమీకండక్టర్‌లు డిజిటల్ వజ్రాలు అని ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సెమినార్ కన్వీనర్ మోహన్‌బాబు, వరంగల్ నిట్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీమ్, శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకుడు సురేష్‌కుమార్, సౌత్ క్యాంపస్ అధ్యాపకులు హరిత, లలిత, వైశాలి, సరిత, దిలీప్, శ్రీమాత, నాగరాజు, సబిత, వివిధ యూనివర్సిటీల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యం
పెంచేందుకు కొత్త కోర్సులు
ఉన్నత విద్యామండలి
వైస్‌చైర్మన్ పురుషోత్తం


