
పొంగుతున్న ‘పోచారం’
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టుకు వరద నీరు పొటెత్తింది. శుక్రవారం రాత్రి ఎగువన కురిసిన భారీ వర్షాలతో శనివారం ఉదయం నుంచి ప్రాజెక్టులోకి వరదనీటి చేరిక మొదలయ్యింది. ఉదయం 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి 12 వేలు దాటింది. 12,867 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 21.5 అడుగుల(1.820 టీఎంసీ)తో ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో అంతే నీరు అలుగుపైనుంచి దిగువకు ప్రవహిస్తోంది. ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రావు ప్రాజెక్టును సందర్శించారు. ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లుతో మాట్లాడి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు, మంజీర పరీవాహక ప్రాంతాలకు ప్రజలెవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆర్డీవో సూచించారు. ప్రాజెక్టు వద్దకు ప్రజలెవరూ వెళ్లకుండా బందోబస్తే ఏర్పాటు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. వారివెంట నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐ రాజిరెడ్డి, ఎస్సై భార్గవ్‌గౌడ్, ఎంపీడీవో ప్రభాకరచారి, ఇరిగేషన్ ఏఈ అక్షయ్‌కుమార్ తదితరులున్నారు.
● 12,867 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టును సందర్శించిన ఆర్డీవో, డీఎస్పీ
మద్నూర్‌లో ఇంట్లోకి చేరిన వరద నీరు