
గుంతల దారి..
కల్కినగర్ రోడ్‌నంబర్–4 లో గుంతలు
భవానీనగర్‌లో రోడ్డుపై ఏర్పడిన గుంతలు
జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో మరింతగా దెబ్బతిన్నాయి. పట్టణంలోని భవానీనగర్ కాలనీలో రోడ్లపై గుంతలు ఏర్పడి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్కినగర్ వీధి నంబర్ –4 లో కూడా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. –సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

గుంతల దారి..