
‘శక్తిమంతమైన దేశంగా చేయడమే సంఘ్ లక్ష్యం’
మద్నూర్: భారత్‌ను శక్తిమంతమైన దేశంగా చేయడమే సంఘ్ లక్ష్యమని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంపర్క ప్రముఖ్ కోటూరి శ్రీధర్ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను స్థాపించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో జుక్కల్ ఖండ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్‌ను స్థాపించి వందేళ్లవుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన ఆవశ్యకత, లక్ష్యం గురించి ప్రజలకు వివరించాలన్నారు. వందేళ్ల ప్రస్థానంలో దేశ సేవకు నిస్వార్థంగా పనిచేసిన స్వయం సేవకులను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కా ర్యవాహ సంతోష్, జుక్కల్ ఖండ కార్యవా హ జుబ్రె సంజు, మద్నూర్, డోంగ్లీ, జుక్కల్ మండలాల స్వయం సేవకులు పాల్గొన్నారు.
‘స్వదేశీ వస్తువులను వినియోగించాలి’
కామారెడ్డి అర్బన్: దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రజలందరు మద్దతు ఇవ్వాలని, స్వదేశీ వస్తువులనే వినియోగించాలని స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్‌జేఎం) తెలంగాణ రాష్ట్ర సహ సంయోజక్ అశోక్ కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని శ్రీసర్వసతి విద్యామందిర్ హైస్కూల్‌లో ఎస్‌జేఎం జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వదేశీ వస్తువులు, విదేశీ వస్తువులపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. భారత్‌ను వ్యతిరేకించే దేశాల వస్తువులను కొనుగోలు చేయవద్దన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగంతో స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. నాసిరకం చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్‌జేఎం ఇందూర్ విభాగ్ సహ సంయోజక్ రాజాగౌడ్, తెలంగాణ ప్రాంత యువ ప్రముఖ్ రాహుల్‌కుమార్, జిల్లా సంయోజక్ మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ
ఎస్‌ఈగా జగదీశ్
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్‌గా జగదీశ్ రానున్నారు. కంతనపల్లి ప్రాజెక్ట్ ఈఈగా పని చేస్తున్న ఆయనకు పదోన్నతి లభించింది. ఎస్సారెస్పీ ఇన్‌చార్జి ఎస్‌ఈగా ఏడాదిపాటు శ్రీనివాస్‌గుప్తా పని చేశారు. నూతన ఎస్‌ఈ సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని కార్యా లయ వర్గాలు తెలిపాయి.

‘శక్తిమంతమైన దేశంగా చేయడమే సంఘ్ లక్ష్యం’