
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ ప్రత్యేక కోచింగ్ సెంటర్ త్వరలో ప్రారంభమవుతుందని యూనివర్సిటీ బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు శ్రీను రాథోడ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆదివారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారి కోసం అనలాగ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ ప్రత్యేక కోచింగ్ నిర్వహిస్తుందన్నారు. నిరుద్యోగులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనివర్సిటీ విద్యార్థులు రాము, సచిన్, శివరాం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.