నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం | - | Sakshi
Sakshi News home page

నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం

Aug 18 2025 12:01 PM | Updated on Aug 18 2025 12:01 PM

నూత్‌

నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం

ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల చెల్లింపులు ఇలా..

ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల చెల్లింపులు ఇలా..
సమాచారం

ఖలీల్‌వాడి: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల నిధులు అందిస్తుంది. దీనిని నాలుగు విడతల వారీగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించే స్థలంలో ముగ్గు పోయగానే సంబంధిత అధికారులు కొలతలు వేసి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇంటి యాప్‌లో ఫొటో తీసి జియో ట్యాగింగ్‌ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా నిధులు మంజూరవుతాయి. అవేంటో తెలుసుకుందాం..

మొదటి విడత

ఇంటి బేస్మెంట్‌ నిర్మాణం పూర్తికాగానే మున్సిపల్‌ వార్డు ఆఫీసర్‌, గ్రామ పంచాయతీ స్థాయిలో సెక్రెటరీ ఇంటి వద్దకు వచ్చి పరిశీలన చేసి ఫొటో తీసుకుంటారు. దానిని సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే మండల ఏఈకి వెళ్తుంది. దీనిని ఏఈ నుంచి డీఈకి లాగిన్‌ అవుతుంది. డీఈ నుంచి పీడీకి చేరుతుంది. పీడీ కలెక్టర్‌ లాగిన్‌కు పంపిస్తారు. కలెక్టర్‌ పంపిన వివరాలు అన్ని పరిశీలించిన రూ. లక్ష నగదును లబ్ధిదారుని ఖాతాల్లో జమ చేస్తారు.

రెండో విడత

రెండో విడతలో మరో రూ. లక్ష మంజూరువుతుంది. ఈ నిధులు మంజూరు కావాలంటే స్లాబు వేసేంత ఎత్తు గోడలు నిర్మించాల్సి ఉంటుంది.

మూడో విడత

మూడో విడతలో మరో రూ. రెండు లక్షలు నిధులు మంజూరు అవుతాయి. దీని కోసం ఇంటి పైకప్పు సిమెంట్‌ స్లాబ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్‌ అధికారులు ఇంటిని పరిశీలించి ఫొటోలను సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

నాలుగో విడత

ఇక నాలుగో విడతలో రూ. లక్ష మంజూరవుతుంది. ఈ నిధులు మంజూరు కావాలంటే ఇంటికి ప్లా స్టరింగ్‌, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటికి రంగులు వేసి ఉండాలి. అధికారులు అన్ని పనులు పూ ర్తయ్యాయా లేదా అని పరిశీలించి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ తర్వాత రూ. లక్ష నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.

మీకు తెలుసా?

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మండలంలోని నూత్‌పల్లిలో స్వ యంభూ లింగ క్షేత్రం ప్రత్యేక చరిత్రను సంతరించుకుంది.ఈ ఆలయంలోని శివలింగం పశువుల పేడ కింద వెలిసినట్లు,గుడిలోని నంది ఎగి రి వచ్చినట్లుగా గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతానికి ఆనుకున్న ఉన్న ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని 150 ఏళ్ల క్రితమే రాతితో నిర్మించారు.

వందల ఏళ్ల క్రితం చంద్రయ్య మహారాజ్‌ అమ్మమ్మ ఒకనాడు పిడకల కోసం పశువులు ఉండే ఊరి కొండ ప్రాంతానికి వెళ్లింది. ఆమె పేడను తీసే క్రమంలో శివలింగం బయటపడింది. విషయం తెలుసుకున్న చంద్రయ్య మహారాజ్‌ ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి గుడిని నిర్మించారు.

రాజరాజేశ్వర స్వామిపై చంద్రయ్య భజన, కీర్తనలు రచించి గ్రామగ్రామాన సంచరించి భక్తి ప్రచారం చేసి, శివుడిలో ఐక్యమైనట్లు స్థలం పురాణం ఉంది. ఆయన సమాధి కూడా గుడికి కొద్ది దూరంలో ఉంది.

చంద్రయ్య మహారాజ్‌ ఓ దొరగారింట్లో భక్తి, కీర్తనలు చేశారు. విని తరించిన దొర కానుకగా ఏమివ్వాలని చంద్రయ్యను అడిగారట. దొర ఇంట్లో ఉన్న నంది విగ్రహం కావాలని కోరారట. చంద్రయ్య నందిపై మంత్రపుష్పాలు వేయగానే దానికి చలనం వచ్చి ఐదు మూరలు రంకెలు కొట్టి నూత్‌పల్లి శివాలయానికి ఎగిరి వచ్చినట్లు స్థల పురాణం.

ప్రస్తుతమున్న నూత్‌పల్లి గ్రామానికి పురా తన ఆలయం ఐదు కిలో మీటర్ల దూరంలో ఉండగా, దీనిని ప్రతీకగా గ్రామంలోనే మరొక కొత్త గుడిని నిర్మించి అక్కడే ప్రతి ఏటా అక్టోబర్‌లో జాతర నిర్వహిస్తారు.

నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం 1
1/2

నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం

నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం 2
2/2

నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement