
అంబులెన్సులో ప్రసవం
పెర్కిట్: ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రవిత ఆదివారం 108 అంబులెన్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మచ్చర్లకు చెందిన రవిత ఆదివారం కాన్పు నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శిశువుకు జన్మనిచ్చింది. అంబులెన్సు సిబ్బంది ప్రథమ చికిత్సలు అందించి దేగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంబులెన్సు సిబ్బంది రమేశ్, శాంత, ఆశా వర్కర్ పుష్పకు కృతజ్ఞతలు తెలిపారు.
కిటికీ ఊచలు తీసి
దొంగతనం
ఖలీల్‌వాడి: నగరంలోని మహాలక్ష్మి కాలనీ నాగటవర్స్‌లో ఉంటున్న బేవసాని విఠల్ ఇంట్లో దుండగులు కిటికీల ఊచలు తీసి దొంగతనం చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. విఠల్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని రాత్రి రెండు గంటల ప్రాంతంలో గదిలో నిద్రపోయారు. దుండగులు పక్క రూమ్‌లో ఉన్న కిటీకల ఊచలు తొలగించి లోపలికి ప్రవేశించారు. ముందుగా కుటుంబ సభ్యులు పడుకున్న రూమ్‌కు గొళ్లెం పెట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.12 తులాల బంగారం, 30 తులాల వెండి దొంగతనం చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పాలు పోసే అతను రావడంతో విషయం గమనించి డోరు తీశారు. విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పైపు లైన్‌కు లీకేజీలు..
వృథాగా నీరు..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి పో చంపాడ్‌కాలనీకి నీటిని సరఫరా చేసే పైపు లైన్ కు లీకేజీలు ఏర్పడటంతో నీరు వృథాగా పో తుంది. లీకేజీల గురించి పట్టించుకోకుండా నీ టిని అలానే సరఫరా చేస్తున్నారు. దీంతో నీరు మొత్తం రోడ్లపై ప్రవహిస్తుంది. ప్రాజెక్ట్ నిర్మా ణ కాలంలో ప్రాజెక్ట్ నుంచి సిమెంట్ పైపులు వేశారు. ప్రస్తుతం ఆ పైపులకు లీకేజీలు ఏర్పడ్డాయి. వర్షకాలం కావడంతో తాగునీరు కలుషితమవుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

అంబులెన్సులో ప్రసవం

అంబులెన్సులో ప్రసవం