
పంటలను ఆశిస్తున్న తెగుళ్లు
● జోరుగా పురుగు మందుల పిచికారీ
నిజాంసాగర్ : వానాకాలం సాగు చేస్తున్న వరితో పాటు ఆరుతడి పంటలను తెగుళ్లు వెంటాడుతున్నాయి. వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే ఎండలు.. లేకపో తే అధిక వర్షాలు.. పంటలను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం పంటపొలాల్లో నీరు నిలుస్తుండడంతో తెగుళ్ల బారిన పడుతున్నాయి. ప్రధానంగా వరి పై రుకు తెగుళ్ల బెడద అధికం అయ్యింది. మొన్నటి వరకు మొగిపురుగు బెడద ఎక్కువగా ఉండడంతో రైతులు పురుగు మందులను పిచికారీ చేశారు. ప్ర స్తుతం పంటపొలాలపై పచ్చ పురుగు దాడి చేస్తోంది. దీంతో తెగుళ్ల నివారణకు రైతులు పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. వర్షాలు తగ్గిన తర్వా తే మందులు పిచికారీ చేయాలని మహమ్మద్‌నగర్ మండల వ్యవసాయాధికారి నవ్య సూచిస్తున్నారు. పచ్చ పురుగు నివారణకు కోరాజెన్ 60 ఎంఎల్ మందును ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే పంటపొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.