‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి ఆదాయం | - | Sakshi
Sakshi News home page

‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి ఆదాయం

Aug 17 2025 6:39 AM | Updated on Aug 17 2025 6:39 AM

‘మహాల

‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి ఆదాయం

బాన్సువాడ : మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ బస్‌డిపోకు వచ్చిన రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నిజామాబాద్‌ నుంచి జహీరాబాద్‌కు(వయా బోధన్‌, బాన్సువాడ, నిజాంసాగర్‌), మరొకటి బాన్సువాడ నుంచి నారాయణ్‌ఖేడ్‌ (వయా పిట్లం, నిజాంపేట్‌) నడుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం సరితాదేవి, బీర్కూర్‌ ఏఎంసీ చైర్మన్‌ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ..

నియోజకవర్గానికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను బాన్సువాడలో పంపిణీ చేశారు. బాన్సువాడ రూరల్‌లో 23 మందికి రూ.7.11 లక్షలు, మున్సిపాలిటీలో 10 మందికి రూ.3.24 లక్షలు, బీర్కూర్‌ మండలంలో ఐదుగురికి రూ.1.56 లక్షలు, నస్రుల్లాబాద్‌ మండలంలో 10 మందికి రూ. 3.39 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.

స్వదేశీ జాగరణ్‌ మంచ్‌

జిల్లా కమిటీ నియామకం

కామారెడ్డి అర్బన్‌: స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జి ల్లా కమిటీని శనివారం ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సంఘ చాలక్‌ బొడ్డు శంకర్‌ ప్రకటించారు. స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జిల్లా సంయోజక్‌గా బి.మహేష్‌రెడ్డి, సహా సంయోజక్‌గా ఏ.రాజేశ్వర్‌గౌడ్‌, విచార విభాగ ప్రముఖ్‌గా లింబా గౌడ్‌, మహిళా ప్రముఖ్‌గా మండల శైలజ, సంపర్క్‌ ప్రముఖ్‌గా ఇటిక్యాల మహేష్‌, సంఘర్షణ ప్రముఖ్‌గా సంతోష్‌ నేత, పర్యా వరణ ప్రముఖ్‌గా నరేష్‌, శోధ్‌ ప్రముఖ్‌గా దిలీప్‌, ప్రౌఢ ప్రముఖ్‌గా బి.రాములు, యువ ప్రముఖ్‌గా నవీన్‌గౌడ్‌, ప్రచార ప్రముఖ్‌గా బి.గౌతమ్‌లను నియమించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కార్యవాహ సంతోష్‌రెడ్డి, మంచ్‌ తెలంగాణ ప్రాంత సహ సంయోజక్‌ జి.అశోక్‌, ఇందూ ర్‌ విభాగ్‌ సహ సంయోజక్‌ రాజాగౌడ్‌, ప్రాంత యువ ప్రముఖ్‌ డాక్టర్‌ రాహుల్‌, స్వదేశీ జాగరణ మంచ్‌ ప్రతినిధి డాక్టర్‌ యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.

‘వార్షిక టోల్‌ పాస్‌ను

సద్వినియోగం చేసుకోండి’

పిట్లం: వార్షిక టోల్‌ పాస్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంగళూరు టు మహారాష్ట్ర బార్డర్‌ హైవే మెయింటెనెన్స్‌ కం రెసిడెన్స్‌ ఇంజినీర్‌ రవి శంకర్‌ సూచించారు. శనివా రం ధర్మారం టోల్‌ ప్లాజా వద్ద వాహనాల కోసం వార్షిక పాస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ ప్రీ బుకింగ్‌ శుక్రవారం ప్రారంభమైందన్నారు. పాస్‌ యాక్టివేట్‌ అయిన త ర్వాత నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రి ప్పుల వరకు చెల్లుబాటు అవుతుందన్నారు. జాతీయ రహదారులపైనే చెల్లుతుందని, రా ష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని హైవేలపై వర్తించ దని పేర్కొన్నారు. వార్షిక పాస్‌ వాణిజ్య వా హనాలకు వర్తించదన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ టోల్‌ ఎక్స్‌పర్ట్‌ మహమ్మద్‌ రఫీ, క్యూబ్‌ హైవేస్‌ మేనేజర్‌ అక్షయ్‌ కుమార్‌, ధర్మారం టోల్‌ ప్లాజా కాంట్రాక్టర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘మహాలక్ష్మి’తో  ఆర్టీసీకి ఆదాయం 
1
1/2

‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి ఆదాయం

‘మహాలక్ష్మి’తో  ఆర్టీసీకి ఆదాయం 
2
2/2

‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement