కామారెడ్డి అర్బన్ : విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక జన్మభూమిరోడ్డులో నాయకులు కాషాయజెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ, ధర్మసంస్థాపన, హిందు సమాజాన్ని ఏకం చేయడం కోసం 1964 సంవత్సరం గోకులష్టమి రోజున విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేశారని వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు వడ్ల వెంకటస్వామి అన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా ప్రచార ప్రముఖ్ గోపిరాజ్ శ్రీకాంత్‌రావు, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ వివేకానంద అశోక్, ప్రతినిధులు విశ్వంగుప్తా, అనిల్‌కుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు.