స్వాతంత్య్ర పోరులో పిట్లం వీరులు | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర పోరులో పిట్లం వీరులు

Aug 15 2025 6:58 AM | Updated on Aug 15 2025 6:58 AM

స్వాత

స్వాతంత్య్ర పోరులో పిట్లం వీరులు

జ్ఞాపకార్థంగా బాన్సువాడ తహసీల్‌ ఎదుట శిలాఫలకం ఏర్పాటు

తామ్రపత్రం ఇచ్చి సత్కరించిన

అప్పటి భారత ప్రభుత్వం

పిట్లం(జుక్కల్‌): స్వాతంత్య్ర సమర పోరాటంలో పిట్లం గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అ ప్పటి నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ డివిజన్‌ పరిధిలో 8 మంది స్వాతంత్య్ర సమరయోధులు ఉ ండగా, వారిలో 7 గురు పిట్లం గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. వీరిలో నీలకంటి లోక నా రాయణ, నీలకంటి లోక లక్ష్మయ్య, ఉప్పు లక్ష్మయ్య, గంగా నాగయ్య, కొండ నారాయణ, వంజరి బాలరాజు, కుమ్మరి లక్ష్మారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వీరెవరు బతికిలేరు. వీరిలో నీలకంటి లో క నారాయణ పిట్లం సర్పంచ్‌ గా పని చేశారు. గ్రా మంలోని పాత గడి హనుమాన్‌ ఆలయం నుంచి పోలీస్‌ స్టేషను వరకు కాలి బాటగా ఉన్న రోడ్డు ను వెడల్పు చేసిన ఘనత, గ్రామానికి మొదటిగా విద్యుత్‌ తెచ్చిన ఘనత ఈయనకు దక్కింది. ఇతని సోదరుడు నీలకంటి లోక లక్ష్మయ్య తహసీల్దార్‌ గా పదవి విరమణ చేసినంతరం అన్నతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ఉప్పు లక్ష్మయ్య పిట్లం గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. అప్పట్లో తెలంగాణ విమోచన కోసం, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అప్పటి భారత ప్రభుత్వం వీరందరికి తామ్ర పత్రం ఇచ్చి సత్కరించింది. ఇ ప్పటికి బాన్సువాడ తహసీల్‌ కార్యాలయం ఎదుట శిలాఫలకంపై వీరి పేర్లు ఉండటం విశేషం. వీరి జ్ఞాపకార్థం గ్రామంలో ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈకూడలిలో వీరి తదనంతరం వారి వారసులు జెండా ఎగురవేస్తున్నారు.

స్వాతంత్య్ర పోరులో పాల్గొన్న పిట్లం వీరుల ఫ్లెక్సీ , బాన్సువాడ తహసీల్‌ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శిలాఫలకం, పిట్లంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం

పిట్లం అనే పేరు ఇలా వచ్చింది

స్వాతంత్య్ర సమర పోరాటం జరగుతున్న సమయంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా రహస్యంగా పిట్లంకు చెందిన సమరయోధులు రహస్యంగా యువకులచే ఒక పటాలం (గ్రూప్‌)ను ఏర్పాటు చేశారు. వీరందరికి రామ మందిరం వద్ద శిక్షణ ఇచ్చేవారు. పటాలం అనే పేరు కాలక్రమంలో మార్పుచెంది గ్రామానికి పిట్లంగా పేరు వచ్చింది.

స్వాతంత్య్ర పోరులో పిట్లం వీరులు 1
1/2

స్వాతంత్య్ర పోరులో పిట్లం వీరులు

స్వాతంత్య్ర పోరులో పిట్లం వీరులు 2
2/2

స్వాతంత్య్ర పోరులో పిట్లం వీరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement