
పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చిన ఎర్రకుంటతండావాసులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఏర్రకుంటతండావాసులు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. మండలంలోని బెజుగంచెరువుతండా గ్రామపంచాయతీ పరిధిలో బెజుగంచెరువుతండాతోపాటు ఎర్రకుంటతండా ఉన్నాయి. బెజుగంచెరువుతండా గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. దీంతో బెజుగంచెరువుతండాలో జీపీ భవననిర్మాణం కోసం మార్కింగ్ ఇచ్చేందుకు గురువారం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏర్రకుంటతండావాసుల అభ్యంతరంతో అధికారుల మార్కింగ్ పనులను నిలిపివేశారు. ఈ క్రమంలో తమ తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను ఏర్రకుంటతండాకు చెందిన కొందరు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ బెజుగంచెరువుతండావాసులు గురువారం నాగిరెడ్డిపేట ఎంపీడీవోపాటు ఎస్సైకి పిర్యాదు చేశారు. శుక్రవారం ఎర్రకుంటతండావాసులు రెండుట్రాక్టర్లతోపాటు బైక్‌లపై భారీగా పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. బెజుగంచెరువుతండా గ్రామపంచాయతీ భననిర్మాణ విషయమై ఇరుతండావాసులు కూర్చుని మాట్లాడుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్సై భార్గవ్‌గౌడ్ సూచించారు.
బాన్సువాడ : ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి తన నివాసం వద్ద, క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అశోక్ చక్రంను ఆగ్రో చైర్మన్ కాసుల బాల్‌రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయిలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే, గ్రామానికి సర్పంచే దేవుడని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, డీఎస్పీ విఠల్‌రెడ్డి, డీఎఫ్‌వో సునీత, ఎఫ్‌ఆర్‌వో అబిబ్, తహసీల్దార్ వరప్రసాద్, కమిషనర్ శ్రీహరి రాజు, డిఎల్‌పీవో సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చిన ఎర్రకుంటతండావాసులు