
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులదే ప్రధానపాత్ర
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులదే ప్రధాన పాత్ర అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉత్తమపని తీరు కనబర్చిన పంచాయతీ కార్యదర్శులను ఆయన సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించగా, అవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్న పంచాయతి కార్యదర్శులను ఆయన అభినందించారు. కార్యదర్శులను శాలువాతో సన్మానించి ప్రశంసాపత్రాలను అందించారు.
పారిశుధ్య కార్మికులకు యూనిఫాంల అందజేత
ఎల్లారెడ్డి మున్సిపాలిటి పారిశుధ్య సిబ్బందికి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు యూనిఫాంలను అందజేశారు.వారిని శాలువాతో సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టన అధ్యక్షులు సాయిబాబా, వినోద్‌గౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్ రజిత, మున్సిపల్ మాజీ చైర్మన్లు కుడుములసత్యనారాయణ, పద్మశ్రీకాంత్, సొసైటీ వైస్ చైర్మెన్ ప్రశాంత్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గఫార్, ఆరీఫ్, మున్సిపల్ కమీషనర్ మహేష్‌కుమార్ తదితరులున్నారు.
రామారెడ్డి మైదానాన్ని
మినీ స్టేడియంగా మారుస్తా..
రామారెడ్డి: రామారెడ్డి మైదానాన్ని మినీ స్టేడియంగా మారుస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రామారెడ్డి గ్రామంలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు శుక్రవారం ప్రారంభించారు. గంగమ్మ వాగు బ్రిడ్జి పనిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేస్తామన్నారు. కాలభైరవుడు ఆలయ అభివృద్ధికి కోసం కావలసిన నిధులు మంజూరు చేయించినట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఇర్షత్ , సింగిల్ విండో చైర్మన్ సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవుఫ్, మండలఅధ్యక్షుడు లక్ష్మాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.