
అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయండి
బిచ్కుంద(జుక్కల్) : కొత్తగా ఏర్పాటు చేసిన బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 12 వార్డులలో చెత్త సేకరణ కోసం చిన్న విధులలో వెళ్లడానికి ట్రాలీ ఆటోలు కావాలని, కార్యాలయంలో కంప్యూటర్లు ఇతర సామగ్రి కోసం సుమారు రూ. 50 లక్షల నిధులు కావాలని కమిషనర్ ఖయ్యూం ఎమ్మెల్యేకు నివేదిక అందించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీచైర్‌పర్సన్ కవిత, నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్, విఠల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దడ్గి నాగ్‌నాథ్, గంగాధర్ పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
నిజాంసాగర్ (జుక్కల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. శుక్రవారం జుక్కల్ క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలు చేరారు. పార్టీ కోసం, అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేసిన వారికి మంచి పదవులు లభిస్తాయన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ పటేల్, మహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏలే మల్లికార్జున్, నాయకులు రమేష్ యాదవ్, కాలిక్, తోటరాజు, సిద్దు, మల్లయ్య, ఆకాష్ తదితరులున్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పెద్ద పోతంగల్ గ్రామశివారులో పేకాట స్థావరంపై శుక్రవారం దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామ శివారులో పేకాడుతున్నారనే పక్కా సమాచారం మేరకు దాడి చేసి రూ.5885 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా, ఒకరు పారిపోయారని తెలిపారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
దోమకొండ: మండలంలోని చింతమాన్‌పల్లి గ్రామంలో జరుగుతున్న మల్లికార్జున స్వామి నూతన దేవాలయ నిర్మాణానికి శుక్రవారం ముత్యంపేట గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ముత్తగారి శిరిష్‌గౌడ్ రూ.11వేలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ ప్రతినిదులు ఉన్నారు.