
లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
దోమకొండ/భిక్కనూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో కలిసి దోమకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో, భిక్కనూరు మండలంలోని బస్వాపూర్, భిక్కనూరులలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచితంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని, దశలవారీగా నిర్మాణం జరిగిన కొద్దీ బిల్లులు వెంటనే లబ్ధిదారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ ఇంజినీర్లు నాణ్యతగా ఇల్లు నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. దోమకొండలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, హౌసింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, ఆర్డీవో వీణ, హౌసింగ్ డీఈ సుభాష్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, భిక్కనూరులో ఎంపీడీవో రాజ్‌కిరణ్ రెడ్డి, పంచాయతీ ఈవో మహేశ్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి దయాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్
ఎండీ వీపీ గౌతం