ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
కామారెడ్డి టౌన్ : జిల్లాలో ముస్లింలు సోమవారం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు, పెద్దబజార్, బతుకమ్మకుంట, గొల్లవాడ, అశోక్‌నగర్ కాలనీ, పాతబస్టాండ్‌ప్రాంతాలలోని ఈద్గాల వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. పట్టణంలోని షాహి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించు కోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం అన్నా రు. వీటితో పాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మా న్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండుగలలో రంజాన్ ఒకటి అన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, జిల్లా అధికారులు షబ్బీర్ అలీని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మాట్లాడుతున్న షబ్బీర్ అలీ


