నేడు క్రిస్మస్
● జిల్లాలో ముస్తాబైన చర్చీలు
● ప్రార్థనలు చేయనున్న క్రైస్తవులు
కామారెడ్డి టౌన్: క్రైస్తవులు బుధవారం క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని చర్చీలను ముస్తాబు చేశారు. జిల్లాకేంద్రంలోని సీఎస్‌ఐ వెస్లీ, అశోక్‌నగర్‌కాలనీ, గోదాంరోడ్, రామారెడ్డిరోడ్, హరిజనవాడ, గొల్లవాడ తదితర కాలనీలోని ప్రార్థన మందిరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీ, ఏసుక్రీస్తు జననాన్ని చాటిచెప్పే పశువుల పాకలు ఏర్పాటు చేశారు. చర్చీల లోపలా అందంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నేడు క్రిస్మస్


